గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల సంస్థాగత పర్యటనలో భాగంగా మండల కమిటీ, బూతు కమిటీలు, శక్తి కేంద్రాలు పూర్తి చేసి మండలంలో పార్టీని బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చాలని అలాగే ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా స్థానికులను స్వదేశీ వస్తువులను కొనాలని ప్రోత్సహించడంతో పాటు ఇంటింటా స్వదేశీ – ప్రతి ఇంటా స్వదేశీ పాంప్లేట్లను స్టిక్కర్లను భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయ ప్రకాష్ నారాయణ అందచేశారు.
. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మురళి గారు,స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కొల్లిపర మండలం లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయండి. రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయ ప్రకాష్ నారాయణ
04
Nov