హైదరాబాద్ మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణ సమయాల్లో సవరణ చేసినట్లు ప్రకటించారు.సవరించిన ప్రయాణ వేళల ప్రకారం వారంలోని అన్నిరోజుల్లో, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడుస్తాయని పేర్కొన్నారు.సవరించిన ప్రయాణ వేళలు నవంబరు మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మెట్రో ప్రయాణికులు గమనించాలని సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మెట్రో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
మెట్రో టైమింగ్స్ సవరణ
01
Nov