ఇలా చేస్తే తలనొప్పి మాయం

ఒక్కోసారి విపరీతంగా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే మందు బిళ్ల మింగకుండా పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చీకటి గదిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. చీకటి వల్ల కళ్లు, మెదడు విశ్రాంతి పొంది వెంటనే తలనొప్పి తగ్గుతుంది.
  • ఒక్కోసారి శరీరంలో ఏర్పడే నిర్జలీకరణ వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి అనిపించగానే ఒక గ్లాసు మంచి నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది.
  • కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ను చేతిరుమాలులో చుట్టి నుదిటి మీద ఉంచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చల్లటి నీళ్లతో తడిపిన తువాలును తలకు చుట్టుకున్నా ఫలితం ఉంటుంది.
  • గోరువెచ్చని గ్రీన్‌ టీ తాగినా ప్రయోజనం కనిపిస్తుంది. గ్రీన్‌ టీ లోని యాంటి ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి నరాల పనితీరును క్రమబద్దీకరిస్తాయి. దీంతో తలనొప్పి తగ్గుతుంది.
  • శరీరంలో చక్కెర స్థాయి తగ్గినా విపరీతంగా తలనొప్పి వస్తుంది. ఏదైనా పండు లేదా డ్రై ఫ్రూట్స్‌ తింటే సమస్య తీరుతుంది.
  • మెడ మీద హాట్‌ బ్యాగ్‌ పెట్టుకున్నా మెల్లగా మర్ధన చేసుకున్నా కండరాలు సడలి తలనొప్పి తగ్గుతుంది.
  • ఎక్కువసేపు టీవీ చూస్తున్నా; మొబైల్‌, ల్యాప్‌టా్‌పలను అదేపనిగా వినియోగిస్తున్నా తలనొప్పి తప్పదు. కాబట్టి స్ర్కీన్‌ టైమ్‌ను నియంత్రించుకుని సమయానుసారం వ్యాయామం చేయడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. యోగ, ధ్యానం లాంటివి కూడా మంచి ఫలితాన్నిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *