త్రిఫల కషాయం
ఒక టీస్పూను త్రిఫల చూర్ణాన్ని రెండు కప్పుల నీళ్లకు జోడించి, ఆ నీళ్లు ఒక కప్పుకు తగ్గిపోయేవరకూ మరిగించాలి. ఈ కషాయం శరీరంలోని విషాలను హరించి, జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది.
సొంఠి కషాయం
సొంఠి, చిటికెడు బెల్లం, మిరియాల పొడి.. వీటిని గ్లాసు నీళ్లలో కలిపి మరిగించి తాగాలి. దీంతో అజీర్తి, వాంతులు తగ్గుతాయి.
ఉసిరి, తేనె
తాజా ఉసిరి రసం, గోరువెచ్చని నీరు, ఒక స్పూను తేనెలను కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఆకలి పెరుగుతుంది.
వాము, ఇంగువ నీరు
వాము, చిటికెడు ఇంగువ గ్లాసు నీళ్లలో కలిపి మరిగించి తాగాలి. ఇలా చేస్తే, కడుపుబ్బరం తగ్గుతుంది. పొట్ట శుభ్రపడుతుంది.